Site icon PRASHNA AYUDHAM

బాలసదనం చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు

IMG 20251231 181722

బాలసదనం చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు

కేక్ కట్ చేసి, సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31 

(బుధవారం):

జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నివసిస్తున్న చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్, వారి సంక్షేమం పట్ల జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, వారు పెద్దయ్యాక ఏమవుతారో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పిల్లలు చెప్పిన సమాధానాలను ఆనందంగా స్వీకరించిన కలెక్టర్, వారి కలలు నెరవేరేలా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రూ.134.9 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బాలసదనం భవనాన్ని పరిశీలించిన కలెక్టర్, అన్ని హంగులతో మార్చి నెలలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ట్రైనీ రవితేజ, డీడబ్ల్యూఓ ప్రమీల, ఈఈపీఆర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, సంబంధిత అధికారులు, బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version