Site icon PRASHNA AYUDHAM

నావజాత శిశువు అంబులెన్సుతో ప్రాణం దక్కింది…!

IMG 20251225 WA0013

నావజాత శిశువు అంబులెన్సుతో ప్రాణం దక్కింది…!

లింగంపేట నుంచి నిజామాబాద్ జీజీహెచ్‌కు సురక్షిత తరలింపు – 1 కిలో బరువుతో శ్వాసకోశ సమస్యతో ఉన్న పాపకు తక్షణ వైద్యం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25

లింగంపేట్ మండలం ఎల్లమ్మ తండకు చెందిన మంక్తి అనే మహిళకు 7వ నెలలో హోమ్ డెలివరీ జరిగింది. ఆడ శిశువు బరువు కేవలం 1 కిలో మాత్రమే ఉండటంతో పాటు శ్వాసకోశ సమస్యలు, డల్ యాక్టివిటీ కనిపించాయి. వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. నావజాత శిశువు అంబులెన్సులో IV ద్రావణం, ఆక్సిజన్, అంబుబ్యాగ్ సపోర్ట్‌తో పాటు ఇన్క్యూబేటర్‌లో అత్యంత జాగ్రత్తగా శిశువును తరలించారు. ఈ కీలక సమయంలో అంబులెన్స్ పైలట్ అస్లాం, ఈఎంఎటి కృష్ణస్వామి సమన్వయంతో పని చేసి శిశువుకు ప్రాణం నిలిపారు. శిశువు తండ్రి గోవింద్ అంబులెన్స్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారోగ్య సేవల్లో నావజాత శిశువు అంబులెన్సుల ప్రాధాన్యతకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

Exit mobile version