*గాంధారి మండల కేంద్రంలోని నూతనంగా మంజూరైన పోచమ్మ రేవు వంతెన నిర్మాణం సర్వే పనులు*
ప్రశ్న ఆయుధం న్యూస్ 28 జనవరి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పోచమ్మ రేవు సర్వే చేయడం జరిగింది ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పనులను మంగళవారం పంచాయితీ రాజు అధికారులు సర్వే నిర్వహించారు..ఈ సందర్భంగా గత శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహనరావు పోచమ్మ రేవు వాగును సందర్శించి 4.90 కోట్లు మంజూరు చేశారు..పనులు సైతం వెంటనే ప్రారంభం చేస్తామని చెప్పారు..చెప్పిన రెండు రోజుల్లోనే పంచాయతీ రాజు ఇంజనీర్ సురేష్ ఇతర అదుకారులను పంపించారు..వారు వాగును, పక్కినే గల పంట పొలాలను సర్వే చేశారు..వాగు పై బ్రిద్గె, రోడ్డు నిర్మాణము చేయనున్నట్లు అదుకారులు తెలిపారు..సంగెం రేవు, పోచమ్మ రేవు వంతెనలు రెండు ఒకే సారి పనులు చాలు చేస్తామన్నారు…ఈ కార్యక్రమములో సొసైటీ డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లైన్ రమేష్, మాజీ కాల భైరవ స్వామి ఆలయ చైర్మన్ సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, ఈశ్వరగౌడ్, నీల రవి, సంగని బాలయ్య, ఎండ్రల్ గోపాల్, అహ్మద్, నితిన్, గడ శంకర్, రైతులు తాడ్వాయి విట్టల్ , సంతోష్, నరేష్, రవి, పతి కుమార్ తదితర లు పాల్గొన్నారు..