సంగారెడ్డి, జూలై 28
పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో ఆషాడ మాసం సందర్భంగా ఇంటి కుల దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనం మరియు కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆషాడ మాసం పురస్కరించుకొని ఇంటి కుల దైవం దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనం మరియు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మహిళా అధ్యక్షురాలు కాటా సుధా రాణి, మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, ఉప సర్పంచ్ గోరిమియా, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించారు. అనంతరం వారిని చైర్మన్ శివానందం మరియు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.











