కామారెడ్డి, 2026-07-08
అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SIR ఫారంపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని ఫారం నింపే విధానంపై అవగాహన పొందారు.
అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం SIR ఫారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గిరి, ట్రెయిని కలెక్టర్ రవితేజ, తహసీల్దార్ హిమబిందు పాల్గొని SIR ఫారంపై అవగాహన కల్పించారు. ఫారం నింపే విధానాన్ని వారు వివరించారు. న్యాయవాదుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిదా, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బట్టు దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల నారాయణ, GP, AGP తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.










