కామారెడ్డి పట్టణంతో పాటు పాల్వంచ మర్రి వద్ద బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల ఏర్పాటుకు దాతలు అంగీకారం తెలిపారు. ఈ నెల 14న కామారెడ్డిలో విగ్రహానికి శంకుస్థాపన జరగనుంది.
లోయపల్లి నర్సింగరావు, సురేష్, మాజీ ఎంపీపీ గార్లను సంప్రదించగా, వారు విగ్రహాల ఏర్పాటుకు సహకరించడానికి ముందుకు వచ్చారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు కూడా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
జీడిపల్లి నరసింహారెడ్డి, పరిధిపేట గ్రామ సర్పంచ్ కూడా ఈ విగ్రహాల ఏర్పాటుకు సహకరించారు. వారి సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డిలో బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి ఈనెల 14వ తేదీన కలెక్టర్ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ నాయకులు బట్ట వెంకట రాములు విజ్ఞప్తి చేశారు.









