సంగారెడ్డి, జూలై 7
పథకం కింద 9, అభివృద్ధిఅధికారిఎ.జగదీష్ అధికారి ఎ.జగదీష్లో చదువుతున్న బీసీ 10 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకారవేతనం అందించేందుకు తరగతుల అభివృద్ధిను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతులవెనుకబడిన9, వెనుకబడిన 9, అభివృద్ధి అధికారి ఎ.జగదీష్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ePss వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బీసీ ప్రీ-మెట్రిక్ ఉపకారవేతన పథకం కింద 2026–27 విద్యా సంవత్సరానికి 9వ మరియు 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.జగదీష్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ePass వెబ్సైట్ ద్వారా Fresh/Renewal దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.00 లక్షల లోపు ఉండాలని షరతులు విధించారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి NSP OTR App డౌన్లోడ్ చేసి, ఆధార్ మరియు Face ID ద్వారా 14 అంకెల OTR నంబర్ పొందాలి. అనంతరం ePass వెబ్సైట్లో Fresh/Renewal దరఖాస్తు సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తు సమయంలో పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన అనంతరం సంబంధిత ధృవపత్రాల హార్డ్ కాపీలను సంబంధిత మండల బి.సి. సంక్షేమ అధికారికి సమర్పించాలని సూచించారు.
అర్హత, మెరిట్ మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపికైన విద్యార్థులకు రూ.4,000/- వరకు ప్రీ-మెట్రిక్ ఉపకారవేతనం మంజూరు చేయబడుతుందని తెలిపారు. జిల్లాలోని బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.











