బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తన సతీమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ సంధ్యతో కలిసి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్వామివారి దర్శనం తమకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చిందని తెలిపారు.
ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.












