సంగారెడ్డి, జూలై 27
ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదు, వినతిని అత్యంత బాధ్యతతో పరిశీలించి, నిర్దిష్ట రిమార్కులతో సకాలంలో, సమగ్రంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతి ఫిర్యాదు, వినతిని అత్యంత బాధ్యతతో పరిశీలించి, నిర్దిష్ట రిమార్కులతో సకాలంలో, సమగ్రంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా జిల్లాకు వచ్చిన ఫిర్యాదులతో పాటు జిల్లా ప్రజావాణిలో అందిన వినతులను కూడా సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదును వాస్తవ పరిస్థితుల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి, స్పష్టమైన నివేదికలు, నిర్దిష్ట రిమార్కులతో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు.
అందిన వినతులు ప్రధానంగా రెవెన్యూ, ఉద్యానవన, వ్యవసాయం, పెన్షన్లు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్, నీటిపారుదల, పోలీసు, రిజిస్ట్రేషన్, కార్మిక, విద్య, ఆర్టీసీ, పౌరసరఫరాలు, మహిళా మరియు శిశు సంక్షేమం, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలు, పురపాలక సంస్థలకు సంబంధించినవి.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంగారెడ్డి ఆర్డీఓ, కలెక్టరేట్ రెవెన్యూ శాఖ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












