జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, హమాలీల సంఖ్యను పెంచాలని, రవాణా కాంట్రాక్టర్లకు వాహనాల లభ్యతను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ధాన్యం సేకరణ, తరలింపు, అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతిపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సంఖ్య పెంచాలని, వాహనాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
మిల్లులు, గోదాంలకు ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని, అన్ లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. మిల్లుల వారీగా అన్ లోడింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ కొనుగోళ్ల శాతాన్ని పెంచాలని ఆదేశించారు.
వర్షాల నేపథ్యంలో ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుండి హమాలీలను ఇతర ప్రాంతాలకు తరలించి, అన్ లోడింగ్ వేగవంతం చేయాలని సూచించారు.
ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలను సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలని, కొనుగోళ్లను సజావుగా, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.











