సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి అన్ని శాఖల డివిజనల్ స్థాయి అధికారులను హాజరుకావాలని ఆదేశించారు.
బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, కలెక్టర్ ప్రతి శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్షించారు. సబ్ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, హౌసింగ్, విద్యుత్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని రూట్లలో పరిధి ప్రారంభం, ముగింపు బోర్డులను 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి సరఫరా పరిస్థితిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్‌ను అడిగి తెలుసుకున్నారు.
వేసవి కాలంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఫీడర్ వారీగా పర్యవేక్షణ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు.












