సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31వ వార్డు పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించారు.
సెయింట్ ఆంథోనీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా, ఓటర్ జాబితా, కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ, జిల్లాలోని పదకొండు మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు 30.67 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.
పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, అర్హులైన ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


