కామారెడ్డి జిల్లాకు చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ప్రతిభ రత్న టాలెంట్ అవార్డు 2026 కు ఎంపికయ్యారు. రక్తదానంలో ఆయన చేస్తున్న విశేష సేవలందించినందుకు గాను హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అందజేయనున్నారు.
డాక్టర్ బాలు తన సేవలకు గాను ఎంపికైన ఈ ప్రతిష్టాత్మక అవార్డుపై తన కృతజ్ఞతలు తెలిపారు. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ, నేషనల్ ఇన్ చార్జ్ బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీల శ్రీధర్ లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, 2007లో కామారెడ్డిలో రక్తదాతల సమూహాన్ని స్థాపించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 350కు పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించామని, 26 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించామని వివరించారు.
ముఖ్యంగా, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆరు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలిగామని ఆయన పేర్కొన్నారు. తమ బృందం ఎల్లప్పుడూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందించడానికి కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.












