ముదిరాజ్ ఉద్యోగులు, PhD విద్యావేత్తల సంఘం ఆధ్వర్యంలో సమాజసేవకు అంకితమైన డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ ను ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో శాసన మండలి ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మెన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.
శనివారం నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజా చైతన్యం మరియు విద్యా ప్రగతి కోసం డాక్టర్ విఠల్ ముదిరాజ్ చేస్తున్న కృషిని ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, కార్పొరేషన్ చైర్మెన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లు కొనియాడారు.
సన్మానం అనంతరం డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ, 'మన బాధ్యత కేవలం మనకే పరిమితం కాకుండా ప్రజల కోసం కూడా ఉండాలి. సమాజ ఉన్నతికి, అభివృద్ధికి మేధావుల ఆలోచనలు, త్యాగాలు ఎంతో దోహదపడతాయి' అని అన్నారు.
ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ, 'విద్య ద్వారానే సమాజంలో చైతన్యం తీసుకురావచ్చని, తద్వారా హక్కులను సాధించుకోవచ్చని' అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగినవారు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.
ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మెన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, విద్యావంతులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ ముదిరాజ్, పలువురు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.







