జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు, అలాగే ఇటీవల ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి ఘన సన్మానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాల లో శుక్రవారం జరగనుంది. విద్య, సామాజిక సేవ, ప్రజా నాయకత్వ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ మాట్లాడుతూ, గౌడ సమాజ యువత విద్యా రంగంలో మరింత ముందుకు రావాలని, విద్యార్థులను అభినందించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలని అన్నారు.
ఇటీవల ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులను సన్మానించడం ద్వారా సమాజ ఐక్యతను చాటాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గౌడ బంధువులు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఉద్యమ నాయకులు కోరారు. ఏర్పాట్లలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, నరేష్ గౌడ్, కరోల్ల శేఖర్ గౌడ్, అంకన్న గారి గంగాధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దేవేందర్ గౌడ్ తదితరులు పాలుపంచుకుంటున్నారు.










