మనూర్ మండలం బోరంచ గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబానికి GMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు.
GMR ఫౌండేషన్ చైర్మన్, BRS పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ గారి ఆదేశాల మేరకు, మోమిడి జహీద బేగం కుటుంబానికి నెల రోజుల నిత్యావసర సరుకులతో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలవాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, GMR ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, చాకలి సత్యన్న, కొత్తకపు పాండురంగారెడ్డి, పుట్టి శివన్న, పాలడుగు రాములు, పాలడుగు పండరి, విఠల్, మొట్లకుంట లింగం, బదర్గమ లింగం, బెయింట్ల మోహన్, జంగం రుద్రయ్య, దేవనూర్ మాణిక్యయ్య, చకలీ మహిపాల్, చాకలి భూమయ్య, ఎర్ర శ్రీశెలం, పేదనోళ్ళ మల్లేష్, బుకా ఇస్మాయిల్, డాంగే ఆయుం, చెట్టుకింది సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయాన్ని అందించడం జరిగింది. లబ్ధిదారులు GMR ఫౌండేషన్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫౌండేషన్ చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను పలువురు ప్రశంసించారు.
సామాజిక బాధ్యతతో పాటు, అవసరమైన వారికి సహాయం అందించడంలో GMR ఫౌండేషన్ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని వారు హామీ ఇచ్చారు.









