సనాతన హిందూ ధర్మంలో ఆహార నియమాలకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా, ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఈ నియమాలు వ్యక్తిగత శుద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తాయని నమ్మకం.
హిందూ సంప్రదాయం ప్రకారం, భోజనం చేసే ముందు, తర్వాత చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. తడి కాళ్ళతో భోజనానికి కూర్చోవాలి. తూర్పు లేదా ఉత్తర దిశగా కూర్చుని భోజనం చేయడం శ్రేయస్కరం. ఆహార పదార్థాలను పళ్ళానికి తాకించకుండా, ఎంగిలి చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎంగిలి పదార్థాలను ఇతరులకు అందించడం మహా పాపంగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అన్నపు పాత్రలో నేతి గిన్నెను ఉంచడం, మెతుకులు నేతిలో పడటం వంటివి నివారించాలి. భోజనం మధ్యలో లేవడం, ఎంగిలి చేతితో వస్తువులను తాకడం, ఎడమ చేతితో కంచాన్ని ముట్టుకోవడం వంటివి చేయరాదు. ఒకవేళ పొరపాటున కంచాన్ని ముట్టుకుంటే, ఎడమ చేతితో నీటిని తాకాలి. పగిలిన లేదా సొట్టలున్న కంచాలను ఉపయోగించరాదు.









