హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్చి 3 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 5 ఉదయం 6 గంటల వరకు 36 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయబడతాయని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్–1968లోని నిబంధనల ప్రకారం, కామదహనం మరియు హోలీ పండుగలను పురస్కరించుకుని ఈ మూసివేత ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ (ఎ4) షాపులు, బార్లు, క్లబ్బులు, టిడి-1, సిఎస్-2 దుకాణాలు ఈ సమయంలో తెరవబడవని స్పష్టం చేశారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

