కామారెddi జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం సెన్సస్–2027, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మరియు భూభారతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్, సెన్సస్–2027 కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుగా పూర్తి చేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలను అందించాలని మరియు సేకరించే సమాచారాన్ని ఖచ్చితంగా, నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.












