అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తూ దేశ సంపదను సృష్టించే కార్మికుల కృషి, త్యాగాలను ఆయన కొనియాడారు.
ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కేసీఆర్ పేర్కొన్నారు.
చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సబ్బండ కులాల కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని ఆయన తెలిపారు.
ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా కార్మికుల అభివృద్ధికి కృషి చేశామని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చాయని ఆయన పేర్కొన్నారు.







