సదాశివపేటలోని ది మాస్టర్మైండ్స్ ఈ-టెక్నో స్కూల్ తన మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం సాయంత్రం బసవ సేవ సదన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పాఠశాల విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు, దేశభక్తి గీతాలు, నాటికలు, జానపద నృత్యాలు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతిభా ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్లు పులిమామిడి మమత రాజు, అపర్ణ శివరాజ్ పాటిల్, కొత్త గొల్ల సోమశేఖర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
పాఠశాల డైరెక్టర్ ఎం. నవనీత సంతోష్ గుప్తులు ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్షికోత్సవం విజయవంతం కావడంలో అందరి సహకారం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.


