దేశవ్యాప్తంగా ఫార్మా వ్యాపారాలు ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. ఈ బంద్ ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు కొనసాగనుంది.
ఫార్మసీ యజమానులు ఆన్లైన్ మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. అక్రమ మందుల విక్రయాలను ప్రభుత్వం అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనలో భాగంగా, దేవరుప్పుల మండలకేంద్రంలో ఉన్న మెడ్ ప్లస్ మందుల షాపును దేవరుప్పుల మండల మెడికల్ షాపు అసోసియేషన్ సభ్యులు బంద్ చేయించారు.
ఈ బంద్‌లో ఏల మంజులత, గుండు సుధాకర్, మామిడాల మణి ప్రసాద్, మునగాల మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫార్మసీల వల్ల స్థానిక మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఇది వ్యాపారాలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు తెలిపారు.











