మెగా పవర్ స్టార్ రాంచరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా బాలానగర్ లోని మైత్రీ విమల్ థియేటర్ లో మెగా అభిమానులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు రామ్ తాళ్లూరి, ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
మెగా అభిమానులు సందీప్ దానపాల్, అరవింద్, చెర్రీల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి, సైబరాబాద్ మున్సిపల్ కో- ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ, ఒక రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రామ్ తాళ్లూరి, ప్రేమ కుమార్ అన్నారు. తలసేమియా, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర సమయాల్లో రక్తానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని వారు తెలిపారు.
రక్తదానం చేసిన యువతను, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భోగాది వెంకటేశ్వర రావు, కొల్లా శంకర్, గడ్డం కిషోర్ నాగరాజు, పులగం సుబ్బు, నరేశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.







