నిజామాబాద్, జూలై 12
తెలంగాణలో అటవీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ములుగులోని అటవీ కళాశాల–పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ) ఒక శుభవార్తను ప్రకటించింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 45 సీట్లకు దరఖాస్తులను ఆహ్వానించగా, జూలై 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
తెలంగాణలో అటవీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ములుగు అటవీ కళాశాల–పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ) శుభవార్త అందించింది. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 45 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ విభాగాల్లో ఉత్తీర్ణులై, టీజీ ఈఏపీసెట్–2026లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణలో తొలి అటవీ కళాశాలగా పేరుగాంచిన ఈ విద్యాసంస్థ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా ములుగులో 52 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక ప్రాంగణంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సులో అటవీ సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆగ్రో ఫారెస్ట్రీ, వాతావరణ మార్పుల వంటి కీలక అంశాలను బోధిస్తారు. అలాగే దేశంలోని ప్రముఖ అటవీ ప్రాంతాలకు క్షేత్రస్థాయి పర్యటనలు, నర్సరీ నిర్వహణ, తేనెటీగల పెంపకం, ప్రాక్టికల్, ఫీల్డ్ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
ఇప్పటివరకు ఈ కళాశాల నుంచి 587 మంది విద్యార్థులు అటవీ విద్యను పూర్తిచేయగా, వారిలో 348 మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి పొందినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. బీఎస్సీ ఫారెస్ట్రీతో పాటు ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు కళాశాల అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు: www.fcrihyd.in.












