భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి గుండం భవానీ శ్రీనివాస్ తరుపున మురళీధర్ యాదవ్ ప్రచారం నిర్వహించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో, బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ యాదవ్ ప్రజలను కలుసుకుని పార్టీ విధానాలను వివరించారు.
మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ, భవానీ శ్రీనివాస్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. 3వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరవేయడమే బీజేపీ లక్ష్యమని ఆయన చెప్పారు.


