నెల్లూరు జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మవద్దని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS స్పష్టం చేశారు.
జిల్లాలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వదంతులను ఎస్పీ ఖండించారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసుల నిఘా కొనసాగుతోందని, సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తున్నామని తెలిపారు.
అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
వదంతులు వ్యాప్తి చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం వంటి నేరాలపై చట్టపరమైన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇంధన లభ్యతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.










