నిజామాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ, శ్రీపాదరావు సౌమ్య స్వభావం గల ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. స్పీకర్గా పనిచేసిన సమయంలో ఆయన నిజాయితీ, నిరాడంబరత ప్రజల మన్ననలు పొందాయని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు విశేషమైనవని అదనపు డీసీపీ కొనియాడారు. ఆయన ప్రజా జీవితంలో ఎంతో నిబద్ధతతో పనిచేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పీసీఆర్ సీఐ వీరయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ శ్రీపాదరావు సేవలను స్మరించుకున్నారు.

