నిజామాబాద్ నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, ఏప్రిల్ 2న ఉదయం జీజీహెచ్ ఆసుపత్రి సమీపంలో అపస్ధ్థితిలో ఉన్న ఒక వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 5న ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చని, అతను లేత ఆకుపచ్చ, నీలి, బూడిద రంగుల ఫుల్ షర్ట్, బూడిద రంగు స్వెటర్, తెలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
భిక్షాటన చేసుకునే వ్యక్తిగా అనుమానిస్తున్న మృతుడి వద్ద నిజామాబాద్ నుండి భైంసాకు సంబంధించిన బస్ టికెట్, వేరొకరి ఆధార్ కార్డు లభించాయి. ఆధార్ కార్డులో సయేద్ ఇమ్రాన్ అనే పేరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే, నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను 8712659714 నంబర్లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. రఘుపతి కోరారు.











