కామారెడ్డి, జూలై 13
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి ఆసుపత్రి ప్రధాన గేటు నుంచి లోపలికి చొచ్చుకెళ్లి, అక్కడే ఏర్పాటు చేసిన జనరేటర్‌ను ఢీకొట్టింది.
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి, ఆసుపత్రి ప్రధాన గేటు నుంచి వేగంగా లోపలికి దూసుకొచ్చి జనరేటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన రాత్రి సుమారు 11:55 గంటలకు చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జనరేటర్ దెబ్బతిన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి అంబులెన్స్ అధిక వేగమే కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
సమాచారం అందుకున్న ప్రభుత్వాసుపత్రి పోలీసు అవుట్‌పోస్ట్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. జనరేటర్‌కు జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తుండగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












