తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ నిర్వహించనున్న హోమియోపతి అండ్ ఆయుష్ డే వేడుకల్లో భాగంగా, నెల 10న సంగారెడ్డిలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడుతోంది. ఈ క్యాంపులో ప్రజలకు ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య సలహాలు అందించనున్నారు.
హోమియోపతి వైద్యురాలు డాక్టర్ నర్మదా షిండే తెలిపిన వివరాల ప్రకారం, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 10న సంగారెడ్డి జిల్లా బైపాస్ రోడ్డులోని టీఎస్ఓఆర్ఏ, యోగా భవన్ సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు యోగా ప్రదర్శనలు, ఆ తర్వాత 9 గంటల నుంచి ఆయుష్ మెగా మెడికల్ క్యాంపు ప్రారంభమవుతుంది. నేషనల్ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రైజింగ్ – క్యూర్, ప్యూర్, రేర్” నినాదంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు.
ఈ మెగా మెడికల్ క్యాంపు ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు, ఆరోగ్య సలహాలు, ఆయుష్ వైద్యంపై అవగాహన కల్పించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నర్మదా షిండే కోరారు.








