సంగారెడ్డి, జూలై 31
శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 31 వరకు పోలీసు యాక్ట్ (సెక్షన్ 30, 30(ఎ)) అమలులో ఉంటుందని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన సూచించారు.
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి 31 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా అదనపు ఎస్పీ సూచించారు.
అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.











