సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు మొత్తం 21 పతకాలు (6 స్వర్ణ, 8 రజత, 7 కాంస్య) సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ క్రీడాకారులను అభినందించారు.
గత వారం రోజులుగా జరిగిన ఈ క్రీడా పోటీలలో సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభతో జిల్లాకు గౌరవాన్ని తెచ్చారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకమని, గెలుపోటములు సహజమని అన్నారు. విజేతలు జాతీయ స్థాయిలో రాణించాలని, ఓటమి చెందినవారు నిరాశ చెందకుండా కృషి చేయాలని సూచించారు.
స్వర్ణ పతకాలను బ్యాడ్మింటన్, యోగా, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాలలో ఈడీ. సజీవ్, బి. ఆదిత్య, ఆర్. సాయిరామ్, కె. జ్యోతి, చి. భాగ్యవతి గెలుచుకున్నారు. వీరి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
రజత పతకాలను బ్యాడ్మింటన్, తైక్వాండో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలలో జి. సంతోష్ కుమార్, డి. మధు, ఎల్. చంద్రశేఖర్, కె. శ్రావ్య సాధించారు. కాంస్య పతకాలను షాట్పుట్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ యోగా విభాగాలలో వి. దేవి సింగ్, కె. సాయి తేజ గౌడ్, పి. ప్రతాప్ రాథోడ్, జె. శివ కుమార్, ఎల్. రవి కుమార్ గెలుచుకున్నారు.


