సంగారెడ్డి, 2026-08-03
సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా నియమితులైన హాఫీజ్ షేక్ షఫీకి ఆయన గురువు, కెనడాలోని ఎడ్మంటన్ నగరానికి చెందిన అల్ ఫజర్ ఇస్లామిక్ సెంటర్ అధ్యక్షుడు, మస్జిద్ ఎ కుబా ఇమామ్ ముఫీ మహమ్మద్ ఇమ్రాన్ ఫారూఖ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షాలువా కప్పి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా నియమితులైన హాఫీజ్ షేక్ షఫీకి ఆయన గురువు, కెనడాలోని ఎడ్మంటన్ నగరానికి చెందిన అల్ ఫజర్ ఇస్లామిక్ సెంటర్ అధ్యక్షుడు, మస్జిద్ ఎ కుబా ఇమామ్ ముఫీ మహమ్మద్ ఇమ్రాన్ ఫారూఖ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షాలువా కప్పి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హాఫీజ్ షేక్ షఫీ వైస్ చైర్మన్ పదవికి ఎంపిక కావడం గర్వకారణమని, ఇది ఆయన సమాజానికి అంకితభావంతో సేవలందించిన నాయకత్వానికి, నిబద్ధతకు, ప్రజల పట్ల ఉన్న సేవా భావానికి ప్రతిఫలమని కొనియాడారు.
అల్లాహ్ కరుణతో మీరు ఈ బాధ్యతను న్యాయంగా, నిష్పాక్షికతతో నిర్వర్తించాలని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రార్థించారు. మీ సేవలు ప్రజలకు ఉపయుక్తమై, ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఫలితాన్ని అందించాలని దువా చేశారు. నాయకత్వంలో నిజాయితీ, నిర్ణయాల్లో దృఢత, సేవలో అంకితభావం కలిగి మున్సిపాలిటీ, సమాజంలో ఐక్యత, శ్రేయస్సు, సానుకూల మార్పులకు మీరు కారణం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ హాఫీజ్ షేక్ షఫీ మాట్లాడుతూ, తన గురువు నుండి అందిన దీవెనలు, శుభాకాంక్షలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలిపారు. గురువు ఆశీస్సులు, మార్గదర్శకత్వం తన ప్రజాసేవా ప్రయాణంలో మరింత ఉత్సాహం నింపుతాయని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ న్యాయబద్ధంగా, పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. గురువుల ఆశీస్సులు, పెద్దల సలహాలు తనకు ఎల్లప్పుడూ దిక్సూచి వంటివని తెలిపారు.
జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని హాఫీజ్ షేక్ షఫీ స్పష్టం చేశారు. తన పదవీకాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రహీమ్, హాజీ సాహెబ్, నూమాన్, షహీద్, రఫీక్ ఖాన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.












