సంగారెడ్డి, జూలై 7
సంగారెడ్డిజిల్లాపోలీసుకార్యాలయసిబ్బంది,స్టేషన్రైటర్లు,సైబర్వారియర్స్,టెక్టీమ్సిబ్బందికివృత్తిపరమైననైపుణ్యాలనుపెంపొందించేందుకుఎంఎస్ఆఫీస్పైప్రత్యేకశిక్షణకార్యక్రమంనిర్వహిస్తున్నారు.ఈశిక్షణతోపనిలోవేగం,ఖచ్చితత్వంపెంచడమేలక్ష్యంగాపెట్టుకున్నట్లుఅదనపు అదనపు ఎస్పీచైతన్యరెడ్డితెలిపారు.
వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, సైబర్ వారియర్స్, టెక్ టీమ్ సిబ్బందికి ఎంఎస్ ఆఫీస్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.
మొత్తం 180 మంది సిబ్బందిని 3 బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు 3 రోజుల చొప్పున శిక్షణ అందించనున్నట్లు ఆయన తెలిపారు. వోక్సెన్ యూనివర్సిటీలో, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల ద్వారా సిబ్బందికి ప్రాక్టికల్ అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. కార్యాలయ పనితీరులో వేగం, ఖచ్చితత్వం, సమర్థత పెరగడానికి ఇలాంటి శిక్షణలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
రోజువారీ విధుల్లో తరచుగా ఉపయోగించే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ వంటి సాఫ్ట్వేర్లలో మెళకువలు నేర్చుకోవడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వోక్సెన్ యూనివర్సిటి డీన్ దయ శంకర్, ప్రొఫెసర్ ఉపాద్యాయ్, ఇతర ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు.












