జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్ను సందర్శించి, ధాన్యం దిగుబడి తీరును, నాణ్యతను, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేయాలని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్ను సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లుకు చేరుతున్న ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియ, నిల్వ విధానం, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిపై ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అన్లోడింగ్ చేసి, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం దిగుబడి శాతం, రికవరీ వివరాలు, సీఎంఆర్ లక్ష్యాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా అందజేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, మిల్ యాజమాన్యం పాల్గొన్నారు.











