గోదావరి పుష్కరాల సందర్భంగా వేములవాడను కలుపుతూ చేపట్టనున్న రూ.50 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్పై తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పక్షపాతం, దురుద్దేశం లేదా విధానపరమైన అక్రమాలు జరిగినట్లు రుజువైతే తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని కోర్టు తెలిపింది.
గతంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ను జారీ చేసే అధికారం టెండరింగ్ అథారిటీకి ఉందని హైకోర్టు పేర్కొంది.
శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.
ఈ తీర్పుతో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియపై ప్రభుత్వానికి స్పష్టత లభించింది.

