నిజామాబాద్, జూలై 7
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్గో పార్సిల్ సేవల ఛార్జీలను 10 శాతం తగ్గించినట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు. ఈ తగ్గింపుతో వినియోగదారులు తక్కువ ఖర్చుతో పార్సిళ్లను పంపించుకోవచ్చని, వ్యాపారులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రయాణికులు, వ్యాపారులు, వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్గో పార్సిల్ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో పార్సిల్ రవాణా ఛార్జీలపై 10 శాతం తగ్గింపు కల్పిస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు. ఈ రాయితీతో వినియోగదారులు తక్కువ ఖర్చుతో పార్సిళ్లను పంపించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే, నిజామాబాద్-1 డిపో కార్గో, పార్సిల్ కార్యాలయంలో స్వాధీనం చేసుకోని పార్సిళ్ల బహిరంగ వేలం మంగళవారం (జూలై 7) మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ బస్టాండ్లోని కార్గో కార్యాలయం ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ప్రజలు, వ్యాపారులు నిర్ణీత సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని డిపో మేనేజర్ కోరారు.











