విజయవాడలో వెలుగు చూసిన ఉగ్రవాద లింకుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అరెస్టు చేసిన నిందితులను విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, అల్ హకీమ్ షుకూర్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు నడిపించడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అల్ హకీమ్ షుకూర్ BENX గ్రూపును ఏర్పాటు చేసి, దాని ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిచ్చినట్లు నిర్ధారించారు. ఈ గ్రూపు కార్యకలాపాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అల్ హకీమ్ షుకూర్ ఎక్కడి నుంచి ఈ కార్యకలాపాలను సమన్వయం చేసుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని అంతర్జాతీయ లింకులపై దృష్టి సారించారు. కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది.











