*నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా రాజేష్ మీనా*
*నిర్మల్ -డిసెంబర్ 30:-* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిమంది ఐపీఎస్ అధికారులను అడిషనల్ ఎస్పీలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా రాజేష్ మీనా ను ప్రభుత్వం నియమించింది. రాజేష్ మీనా స్వస్థలం రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్ కి చెందిన ఈయన 2022 ఐపీఎస్ బ్యాచ్ గా తెలంగాణకి వచ్చారు. హైదరాబాదులో తన సేవలను మరియు శిక్షణను పూర్తిగా అందిస్తున్న సమయంలో నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా రాజేష్ మీనా ను ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది.