Site icon PRASHNA AYUDHAM

నిర్మల్ జిల్లా.. నా భూమి నాకు ఇప్పియ్యండి సారు

IMG 20241223 WA0112

 

*గత కెసిఆర్ ప్రభుత్వం నా ఎకరం నర భూమిని గుంజుకొని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది*. *నా భూమిని నాకు ఇప్పించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష ప్రారంభం*..

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని జాదవ్ మోతీరామ్, జాదవ్ కిషన్లకు చెందిన ఎకరం నర భూమిని గత కెసిఆర్ ప్రభుత్వం గుంజుకొని క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది.
మాజీ సర్పంచ్
జాదవ్ రాజేష్ బాబు ప్రోత్బలంతో ఇది జరిగింది.*ప్రభుత్వం గుంజుకున్నా నా భూమిని నాకు ఇవ్వాలని కోరుతూ అనేక సార్లు కలెక్టర్ గారికి,ఎమ్మార్వో గారికి దరఖాస్తులు ఇచ్చి గతంలో కూడా ఒకరోజు రిలే నిరాహార దీక్ష కలెక్టర్ కార్యాలయం ముందు చేయడం జరిగింది*.స్పందించిన కలెక్టర్ మీ సమస్య పరిష్కరిస్తామని అనడంతో రిలే నిరాహార దీక్షను ఆరోజు విరమించడం జరిగింది.గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితుల, గిరిజనుల పట్టా భూములను గుంజుకొని హరితహారం పేరిట,క్రీడా ప్రాంగణ పేరిట, స్మశాన వాటిక పేరిట పేదల భూములను గుంజుకోవడం జరిగింది.మేము అధికారంలోకి వస్తే కెసిఆర్ ప్రభుత్వం గొంజు కున్న పేదల భూములన్నింటిని తిరిగి ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మా భూమిని ప్రభుత్వం గుంజుకోవడం సరికాదని వెంటనే నా ఎకరం నర పట్టా భూమిని నాకు ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఆ రైతు కుటుంబం రిలే నిరాహార దీక్షకు దిగింది..
ఈ రిలే నిరాహార దీక్షను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి *దుర్గం నూతన్ కుమార్* ఈరోజు ప్రారంభించడం జరిగింది.
సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రజలు ప్రజాస్వామిక వాదులు, రైతులు ఈ రైతుకు మద్దతు తెలపాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలోవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
*డాకూర్ తిరుపతి*,
బాధిత రైతు కుటుంబము *జాదవ్ మోతిరం,జాదవ్ గణేష్* కుటుంబ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు *గడ్డం రాజేష్* లు పాల్గొన్నారు..
కలెక్టర్ కార్యాలయంలో ఈ సమస్యపై డిఆర్ఓ కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 

Exit mobile version