సంపూర్ణ సహాయం, సమగ్ర రక్షణ కోసం ఆర్జీయూకేటీ దత్తత
ఆర్జీయూకేటీ బాసరను ఒక గొప్ప సంకల్పంతో దత్తత తీసుకునే కార్యక్రమం స్టూడెంట్ ఆక్టివిటి సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిల, నిర్మల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రాఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఎస్పీ జానకి షర్మిలా క్యాంపస్ ను దత్తత తీసుకోవడం వారి ఉదారమైన స్వభావానికి ధన్యవాదాలు మరియు విద్యార్థులకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు పాఠ్యేతర కార్యకలాపాలకు అందించడమే లక్ష్యంగా కలసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంతో విద్యార్థులలో బాధ్యత, సమాజ సేవా భావాన్ని పెంపొందించకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సభను ఉద్దేశించి ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ఆర్జీయూకేటీ అభివృద్ధి పథంలో సంపూర్ణ సహాయం, సమగ్ర రక్షణ కోసం ఆర్జీయూకేటీని దత్తత తీసుకోవడం జరిగింది. బాధ్యత కలిగిన పౌరురాలిగా మరియు చట్టాన్ని అమలు చేసే అధికారిణిగా, సమాజానికి తిరిగి ఇవ్వడం నా కర్తవ్యమని తెలిపారు. ఆర్జీయూకేటి విద్యార్థులకు వారి లక్ష్యాలను సాధించడంలో వారికి అవసరమైన మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడానికి నేను కట్టుబడి ఉన్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.