వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలను అరికడతాం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల

 

వార్త పత్రికలు, ఛానల్ లలో వచ్చిన కథనాలకు చలించిన నిర్మల్ జిల్లా ఎస్పి జానకి షర్మిల…

బాసర గోదావరి నది బ్రిడ్జ్ ని భైన్సా ఏ ఎస్పి అవినాష్ కుమార్, ముధోల్ సీ ఐ మల్లేష్, బాసర ఎస్సై గణేష్ లతో కలసి సందర్శించిన జిల్లా ఎస్పి డా.జానకి షర్మిల…

స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో కలసి రివ్యూ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి జానకి షర్మిల….

నేను చార్జ్ తీసుకున్న గత సంవత్సరం నుండి బాసర బ్రిడ్జ్ పై ఆత్మహత్య లు నన్ను కదిలించాయి… ప్రభుత్వ సహాయం తో బాసర బ్రిడ్జి పై ఇరు వైపులా సుమారు ఆరు ఫీట్ల జాలిలు , సిసి కెమెరా లు ఏర్పాటు చేసి బాసర పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేస్తాం.. 24/ 7 ఇద్దరు మహిళా కానిస్టేబుల్ లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు బాసర బ్రిడ్జ్ పై బ్లూకోట్ సిబ్బందిని నియమిస్తాం…ఎల్లవేళలా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచి ఆత్మహత్య ల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా.. బాసర బ్రిడ్జి పై సగ భాగం నిజామాబాద్ జిల్లా పరిధి లో ఉండటం తో నిజామాబాద్ సీపి తో మాట్లాడి వారి సమన్వయం తో ఆత్మహత్య ల నివారణకు నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉంది…:

Join WhatsApp

Join Now