నిర్మల్ పోలీస్. మీ పోలీస్..

నిర్మల్ పోలీస్. మీ పోలీస్..

*జిల్లాలో జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్*

*నిర్మల్  -డిసెంబర్ 31:-* 2025 జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించబడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని, మంగళవారం జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలతో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ సూచనలతో జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి హాజరయ్యారు.

ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బాల కార్మికులుగా పని చేస్తున్న చిన్నారుల సమస్యలను పరిష్కరించడం, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించడం, వారికి పునరావాసం కల్పించి, చట్టపరమైన హక్కులు మరియు రక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ సంధర్భంగా అదనపు ఎస్పి ఉపేంద్ర రెడ్డి మాట్లాడుతూ పిల్లల హక్కులను కాపాడేందుకు పోలీసు విభాగం మరియు ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, మరియు ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు చర్యలు చేపడరని తెలిపారు. గల్లంతైన మరియు బాల కార్మికులుగా బాధపడుతున్న పిల్లలను రక్షించడం సమాజ పునాదులను బలోపేతం చేయడంలో కీలకమైన చర్య అని, “పిల్లల భవిష్యత్తును రక్షించడం ద్వారా సమాజంలో ఒక శక్తివంతమైన మార్పును తీసుకురావచ్చు” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం పిల్లల హక్కులను కాపాడుతూ, వారి భవిష్యత్తు మెరుగ్గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. చైల్డ్ లైన్ 1098, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లలకు తక్షణసహాయం అందించబడుతుంది. పిల్లల పేర్లు, సమాచారం, కుటుంబ కట్టుబాట్ల గురించి పూర్తి వివరాలు సేకరించి వారిని వారి కుటుంబాలకు తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమములో అదనపు ఎస్పీ తో పాటు, రాజా లింగు, లేబర్ అధికారి, సి డబ్ల్యూ సి చైర్మన్ ఎండీ వాహీద్, నాగలక్ష్మి, ఏసీడీపీఒ, ఎస్ఐ లు ప్రదీప్, నరేష్, షి టీం మహిళా ఎస్ఐ సుమంజలి, సి డబ్ల్యూ సి ప్రతినిధి సిమోయిన్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now