సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డి వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆగస్టు 7న సంగారెడ్డి రామ్ మందిరంలో ఈ వివాహ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తమ్ పద్మావతిని కలిసిన నిర్మలా జగ్గారెడ్డి, ఈ ప్రత్యేక శుభసందర్భానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు.
జయారెడ్డి వివాహానికి ఉత్తమ్ పద్మావతికి ఆహ్వానం అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి
Published On: July 28, 2025 3:41 pm