సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆగస్టు 7వ తేదీన సంగారెడ్డిలోని రామ మందిరంలో నిర్వహించనున్న తమ కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నిర్మలా జగ్గారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిన్నా ముదిరాజ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆహ్వానించిన నిర్మలా జగ్గారెడ్డి
Published On: July 28, 2025 8:41 pm