Site icon PRASHNA AYUDHAM

ఢిల్లీలో కాంగ్రెస్ భాగీదారి న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

IMG 20250725 134924

Oplus_0

IMG 20250725 134913

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భాగీదారి న్యాయ సమ్మేళనానికి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే ఓబీసీలకు సముచిత ప్రతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతించారు. ఇది బీసీ హక్కుల పరిరక్షణకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలమురళీకృష్ణ (చిన్నా) ముదిరాజ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మవీన్ గౌడ్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version