సికింద్రాబాద్ కంటోన్మెంట్ డివిజన్ టాపర్ గా పట్లోళ్ల నిశాంత్ రెడ్డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ డివిజన్ టాపర్ గా పట్లోళ్ల నిశాంత్ రెడ్డి

ప్రశ్న ఆయుధం 01 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ జోన్ స్ఫూర్తి స్కూల్లో బోర్లం గ్రామ మాజీ ఎంపీటీసీ పెద్దపట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి దంపతుల కుమారుడు మాస్టర్ పెద్ద పట్లోళ్ల నిశాంత్ రెడ్డి ఎన్ఐఎంహెచ్ స్పెషల్ కేర్ స్కూల్ లో పదవ తరగతి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడై అత్యధిక మార్పులు సాధించి కంటోన్మెంట్ డివిజన్ టాపర్ గా ప్రథమ స్థానంలో నిలిచాడు.తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించి నందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ ఎండి సి.వి. ప్రతాప్ గారి చేతుల మీదుగా మెడల్ ను అందుకున్నారు..ఈ సందర్భంగా డివిజన్ టాపర్ తో పాటుమెడల్ తో మొదటి బహుమతిని సాధించడం పట్ల నిశాంత్ రెడ్డి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.. అందరి ఆశీర్వాదంతో నిశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment