ఏ సి బి కి పట్టుబడిన వారిని టర్మినేషన్ చేసి, పిన్షన్ రాకుండా చట్టముతేవాలి..!

పిన్షన్
Headlines 
  1. “అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఏసీబీ వినతిపత్రం సమర్పణ”
  2. “నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ పోరాటానికి పిలుపు”
  3. “అవినీతి నిర్మూలన కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064 పిలుపు”
  4. “ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక బోర్డులు అమర్చాలని ఏసీబీ వినతి”
  5. “అవినీతి నిరోధక ఉద్యమంలో భాగంగా నిజామాబాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం”
ప్రతి సంవత్సరం డిసెంబర్, 09 న జరుపుకొనే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవములో భాగంగా నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఏ సి బి కి పట్టుబడిన వారిని టర్మినేషన్ చేసి, పిన్షన్ రాకుండా చట్టము చేయాలని అన్నారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఏ సి బి అధికారుల వివరాలతో కూడిన బోర్డులు అమర్చాలని వినతి పత్రమును ఇవ్వడం జరిగినది. సమాజంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు పోరాడాలి అని, ఎక్కడైనా అవినీతి జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064, *9154388950* పై ఫోన్ చేసి సమాచారాన్ని ధైర్యంగా అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సి సి ఆర్ ప్రతినిధులు షేక్ ముజీబ్, మిర్జాపురం రామకృష్ణ, యూసఫ్ ఉద్దీన్, నయీమ్ ఖాన్ బి. సాయిలు, సుమన్, దేకొండ నరేందర్ మరియు మొహమ్మద్ కరీముద్దీన్ స్టేట్ సెక్రెటరీ, జోనల్ ఇన్చార్జి నార్త్ తెలంగాణ జోన్ – 1 పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now