నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 18:
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్ సరఫరా కోసం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ టెండర్ల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్ చైర్మన్ – జిల్లా కొనుగోలు కమిటీ ఆదేశాలమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 సంవత్సరాల కాల పరిమితికి డ్రగ్స్, మెడిసిన్, మెటీరియల్, సామాగ్రి(శాస్త్ర చికిత్స వస్తువులు), రి ఎజెంట్స్, అర్తో ఇంప్లాంట్లు, సరఫరా కోసం అర్హత కాలిగిన తయారీదారీ/అధీకృత డీలర్లు/ నమోదిత సంస్థలు నుంచి టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
దరఖాస్తు రుసుము రూ.5000 డిడి ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 19 నుంచి 27 వ తేది లోపు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. దరఖాస్తుదారులు మరింత సమాచారం కొరకు ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.