నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి – వీడియో సోషల్ మీడియాలో వైరల్

మేయర్
Sample Headlines (Telugu)
  1. “నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి: భూదావా వివాదం కేంద్రబిందువుగా”
  2. “వైరల్ వీడియో: భూమి కబ్జా ఆరోపణలతో దాడి”
  3. “మేయర్ భర్తపై దాడి చేసిన వ్యక్తి వివరాలు: కాంగ్రెస్ కార్యకర్తగా 15 ఏళ్ళు”
  4. “గోపాల్ గ్యాంగ్, భూదావా ఆరోపణలు: నిజామాబాద్‌లో ఉద్రిక్తత”
  5. “మేయర్ భర్త దాడి కేసు: పోలీసులు విచారణ వేగవంతం”

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 19:

నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ భర్త దండు శేఖర్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు, ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని నాగారం ప్రాంతంలో చోటుచేసుకుంది.
శేఖర్ వద్దకు వచ్చి ఓ వ్యక్తి సుత్తితో దాడి చెయ్యడంతో, అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు శేఖర్‌ను స్ధానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు, ప్రస్తుతానికి శేఖర్ చికిత్స పొందుతున్నాడు.

ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దాడి చేసిన వ్యక్తి తన సెల్ఫీ వీడియోను విడుదల చేసి ఈ చర్యకు కారణం తెలియచేస్తూ, “మేయర్ భర్త దండు శేఖర్, గోపాల్ గ్యాంగ్ ద్వారా నా భూమిని కబ్జా చేశారని, గత 3 సంవత్సరాలుగా నా భూమి కబ్జా చేసి, నాకు 2 లక్షల రూపాయల డిమాండ్ చేస్తున్నారు అని ఆ డబ్బులు నేను ఇచ్చే స్థితిలో లేను” అని పేర్కొన్నాడు.

తను గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నానని నాకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ భూమి ఇచ్చారని, తనను శేఖర్ మరియు గోపాల్ గ్యాంగ్ హేళన చెయ్యడంతో ఈ దాడి చేశానని, మేయర్ భర్త పై న్యాయం కోసం మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయం కోసం అభ్యర్థించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment